మంచి జర్నలిస్టును కోల్పోయామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిన్న ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి పడి ఓ ఛానల్ రిపోర్టర్ ఆదినారాయణ మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం మహాప్రస్థానంలో నిర్వహించిన అంత్య క్రియలకు హాజరైన తలసాని, ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. నారాయణతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.