బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను మాసబ్‌ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లో నమోదైన కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు గురువారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. విషయం తెలుసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.