హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పరంపర కొనసాగుతోంది. ఆదివారం మాదాపూర్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. మాదాపూర్ లో అక్రమంగా నిర్మిస్తున్న బిల్డింగ్ కూల్చేశారు. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా నిర్మిస్తున్న బిల్డింగ్ ను అధికారులు కూల్చేశారు. అక్రమ కట్టడమని హైకోర్టు నిర్ధారించినప్పటికీ కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భవనాన్ని నిర్మిస్తున్నట్లు గుర్తించారు.