రైతుల ఆత్మహత్యల పై హరీష్‌ ఆగ్రహం

79చూసినవారు
రైతుల ఆత్మహత్యల పై హరీష్‌ ఆగ్రహం
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గమన్నారు. ఒక రైతు పురుగుల మందు తాగిప్రాణాలు వదిలితే, నిన్న సీఎం సొంత జిల్లాలోనే ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్