ఫార్ములా – ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి చేసేది లత్కోర్ పని అని ధ్వజమెత్తారు. ఫార్ములా -ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చించేందుకు రేవంత్ సర్కార్ భయపడుతోందని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఈ కేసు వ్యవహారంపై తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.