షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు పురపాలక కేంద్రంలోని పూలే చౌరస్తా విస్తరణ, అభివృద్ధికి అఖిలపక్షం సహకరించాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పుర పరిధిలోని జేపి దర్గా రహదారి విస్తరణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షిస్తున్న ఇంజనీర్ తో ఎమ్మెల్యే మాట్లాడారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కల్వర్టుల వెడల్పు, ఎత్తు పెంచాలని సూచించారు.