షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం జిల్లాస్థాయి జోనల్ గేమ్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యయారు. ఆయనతో పాటు జాయింట్ సెక్రటరీ సంతోషి, మండల విద్యా శాఖ అధికారి మనోహర్, ప్రిన్సిపల్ విద్యుల్లత, కమ్మదనం మాజి సర్పంచ్ నర్సింలతో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.