ప్రగతి భవన్ లో తెలంగాణ ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క ను బుధవారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కలిసి నియోజకవర్గంలోని జిల్లేడ్- చౌదరిగూడ మండలంలోని లాల్ పహాడ్ , మల్కపహాడ్ గ్రామాల్లో, కొందుర్గ్ మండలంలోని మహదేవ్ పూర్, చెరుకుపల్లి గ్రామాల్లో అలాగే ఫరూఖ్ నగర్ లోని చింతగూడెం, ఎలికట్ట గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరి చేయగలరని కోరారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయవచ్చని తెలిపారు.