షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కాలనీలలో సమస్యల పట్ల స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల క్రిస్టియన్ కాలనీలో మున్సిపల్ పరిధిలోని 2, 16, 18 వార్డులకు సంబంధించి ఏర్పాటుచేసిన సమావేశంలో స్థానికంగా ఉన్న సమస్యలను నాయకులు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యల పట్ల వెంటనే స్పందించిన ఎమ్మెల్యే శనివారం పనులను ప్రారంభించినట్లు తెలిపారు.