షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేరిట ఓ అభిమాని బిచ్చగాళ్ళకు డబ్బులు పంచారు. కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గాలో ఆదివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పర్యటించారు. హజరత్ జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేపట్టి అధికారులతో సమీక్షించారు. ఎమ్మెల్యే శంకర్ దర్గాను సందర్శించిన వేళ ఆయన అభిమాని మహమ్మద్ ఖాలేద్ అభిమానంతో ఎమ్మెల్యే శంకరన్న పేరిట డబ్బులు బిచ్చగాళ్ళకు పంచారు.