ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుకుల పాఠశాల హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు పెంచుతూ, భోజనానికి ప్రత్యేక డైట్ మెనూ ప్రకటించారు. ఈ సందర్భంగా ఫరూక్ నగర్ మండలం కమ్మదనం గ్రామంలో ఎస్టీ గురుకుల డిగ్రీ మరియు పీజీ హాస్టల్ లో శనివారం నూతన డైట్ మెనూను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ సెక్రటరీ లింగారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ నీత పాల్గొన్నారు.