పేద ప్రజలకు అండగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సూర్య దినపత్రిక పని చేయాలని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) కోరారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఫరూక్ నగర్ మండలం మధురాపురం గ్రామంలో జనరల్ కమ్యూనిటీ హాల్ భవనాన్ని నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్య దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించారు.