బడుగు బలహీన వర్గాలకు చెందిన షాద్‌నగర్ రజక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు బెదిరింపులు సరికావని, ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా స్పందించాలని ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపులను తీవ్రంగా ఖండిస్తున్నామని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ రజక సామాజిక వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టులు తెలిపారు. ఆదివారం షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ రజక సామాజిక జర్నలిస్టులు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.