షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణం జరిగేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిసమక్షంలో తుమ్మల నర్సింలు, ఆయన కుమారుడు వినయ్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా 51వేల రూపాయలను కళాశాల భవన నిర్మాణం కోసం విరాళం నగదు అందజేశారు.