అందరికీ సకల శుభాలు జరగాలి: షాద్ నగర్ ఎమ్మెల్యే
ఉత్తర ద్వార దర్శనంతో స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కారణంగా సకల శుభాలు కలుగుతాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కుటుంబ సభ్యులతో కలిసి చేసుకున్నారు.