కోస్గిలో రేపు రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
రాష్ట్ర స్థాయి SGF (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్)లో భాగంగా హ్యాండ్ బాల్ పోటీలను వచ్చే నెల 3 నుంచి 5 వరకు కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని కోస్గి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించనున్నారు. అండర్-17 విభాగంలో బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా SGF కార్యదర్శి నర్సింలు తెలిపారు.