రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్‌లో ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఓ పెద్ద పులి కుటుంబం సరస్సు దాటుతూ కనిపించింది. ఈ అరుదైన దృశ్యాన్ని సందీప్ అనే ఫోటోగ్రాఫర్ రికార్డ్ చేశాడు. పర్యాటకులు సఫారీ వాహనంపై వెళుతుండగా.. ఒక పులి తన రెండు పిల్లలు, మరో పెద్దపులితో కలిసి రాజ్‌బాగ్ సరస్సు మీదుగా ఈదుకుంటూ వచ్చింది. ఆ దృశ్యాలను కెమెరాలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.