ఆదాయపు పన్ను శాఖ పరిపాలనా సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) కొత్త చైర్మన్‌గా 1988 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి రవి అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ 1986 బ్యాచ్ కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి నితిన్ గుప్తా పదవీకాలం జూన్ 30తో ముగుస్తుంది.
గుప్తా 2022 జూన్‌లో సీబీడీటీ చీఫ్‌గా నియమితులయ్యారు. గత ఏడాది సెప్టెంబరులోనే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా జూన్ వరకు తొమ్మిది నెలల పొడిగింపు ఇచ్చారు.