మరో సంస్థపై ఆర్‌బీఐ ఆంక్షలు

63చూసినవారు
మరో సంస్థపై ఆర్‌బీఐ ఆంక్షలు
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పసిడి రుణాల మంజూరు, పంపిణీకి సంబంధించి ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ కంపెనీపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా షేర్లు, డిబెంచర్లపై ఎలాంటి రుణాలనూ అందించకుండా జేఎం ఫైనాన్షియల్‌ ప్రోడక్ట్స్‌పై కూడా ఆర్‌బీఐ నిషేధం విధించింది. ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఐపీఓ, ఎన్‌సీడీల కోసం రుణాలను ఇవ్వడంలో కొన్ని తీవ్ర లోపాలను గుర్తించిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్