తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 13.6 సెం.మీ వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ 10.8 సెం.మీ, హైదరాబాద్ హిమాయత్ నగర్లో 9.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. చార్మినార్ 9, సరూర్ నగర్ 8.9, నాంపల్లి 8.8, ముషీరాబాద్ 8.7 సెం.మీ వర్షపాతం రికార్డు అయ్యింది.