రాష్ట్రంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 6,100 పోస్టులకు సంబంధించిన శారీరక సామర్ధ్య (పిఎంటి, పిఇటి) పరీక్షలను ఐదు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. పూర్తి వివరాలను slprb.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని ఆమె తెలిపారు.