ఢిల్లీకి అదనపు నీటిని విడుదల చేయండి: ఆతిశీ

66చూసినవారు
ఢిల్లీకి అదనపు నీటిని విడుదల చేయండి: ఆతిశీ
దేశ రాజధానిలో నీటి సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ మంత్రి ఆతిశీ స్పందించారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీలకు లేఖ రాస్తూ నెల రోజుల పాటు అదనపు నీటిని విడుదల చేయాలని కోరారు. ‘ఉష్ణోగ్రత దాదాపు 50 డిగ్రీల సెల్సియస్‌ను తాకింది. ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడానికి, హర్యానా యమునా నదిలోకి అదనపు నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది’ ఆ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్