తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవల ఆయనపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై అత్యున్నత ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ క్రమంలో స్టాలిన్‌పై తాజాగా బీహార్‌లోనూ ఓ కేసు నమోదైనట్లు ఆయన తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకురాగా కొత్త కేసులను నమోదు చేయొద్దని ఆదేశించింది. అలాగే గతంలో మంజూరు చేసిన మధ్యంతర రక్షణను పొడిగించింది.