పెన్షన్ల తొలగింపుపై వైసీపీ దుష్ప్రచారం: మంత్రి కొండపల్లి

76చూసినవారు
పెన్షన్ల తొలగింపుపై వైసీపీ దుష్ప్రచారం: మంత్రి కొండపల్లి
AP: రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు తొలగించినా ఏం నష్టం లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లక్షల్లో పింఛన్లు తొలగించినట్లు వైసీపీ చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 14 వేల పెన్షన్లు మాత్రమే తొలగించామన్నారు. లక్షల్లో పెన్షన్లు తొలగించామని వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. పెన్షన్లపై సర్వే చేసి అనర్హులను తొలగిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్