కాళ్లకు మేకులు కొట్టి.. బాలిక దారుణ హత్య

63చూసినవారు
కాళ్లకు మేకులు కొట్టి.. బాలిక దారుణ హత్య
బీహార్‌లోని నలంద జిల్లాలో ఓ బాలిక దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన హర్నాట్ బ్లాక్‌లోని సార్థ పంచాయతీ పరిధి బహదూర్‌పూర్ గ్రామంలో జరిగింది. బాలిక రెండు కాళ్లకు 12 మేకులు కొట్టారు. బాలిక మృతదేహం అడవిలో దొరికింది. కాగా బాలిక వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే బాలికను క్షుద్ర పూజలు చేసి చంపారని స్థానికంగా అనుకుంటున్నారు. చికిత్స సమయంలో చనిపోతే ఇక్కడకు తీసుకొచ్చి పడేశారని మరి కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్