భారీ వరదలో దూకి ఆవుదూడను రక్షించాడు(వీడియో)

68చూసినవారు
అస్సాంలో భారీ వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదలు 29 జిల్లాల్లో 2.1 మిలియన్ల మంది ప్రజలను మరియు 1.1 మిలియన్లకు పైగా జంతువులను ప్రభావితం చేశాయి. ఈ క్రమంలో భారీ వరదలో చిక్కుకున్న ఓ లేగ దూడను రక్షించడానికి ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం హృదయాలను కలచివేస్తోంది. వరద నీటిలో మునిగిపోతున్న దూడను రక్షించడానికి అస్సాంలోని దులియాజన్ నివాసి తన ప్రాణాలను పణంగా పెట్టి రక్షించాడు. ఈ వీడియో వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్