హైదరాబాద్‌లో సగం సిటీ బస్సులకు విశ్రాంతి

56చూసినవారు
హైదరాబాద్‌లో సగం సిటీ బస్సులకు విశ్రాంతి
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సిటీ బస్సులను తగ్గిస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎండలు మండుతుండటంతో ప్రయాణికులు అంతంతమాత్రమే ఉంటున్నారని, బస్సులను ఖాళీగా తిప్పలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం తప్పనిసరి కాకపోతే బయటకు రావద్దని చెప్పారు. ఇక 2550 బస్సులకు 1275 అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ తెలిపింది.

సంబంధిత పోస్ట్