యూపీలోని ఆగ్రా తాజ్‌గంజ్ ప్రాంతంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. తన ఇంటి సమీపంలో మొరుగుతున్న వీధి కుక్కను ఓ రిటైర్డ్ సైనికుడు లైసెన్స్‌డ్ తుపాకీతో కాల్చి చంపాడు. ఆ వ్యక్తి గతంలో కూడా ఇలాంటి అనేక సంఘటనలకు పాల్పడ్డాడు. సమాచారం అందిన వెంటనే ది కేరింగ్ హార్ట్ సొసైటీ ఎన్జీఓ సభ్యులు దేవేంద్ర కుమార్ శర్మ, అనిరుధ్ ఠాకూర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుక్కను కాల్చిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.