హామీలు అమలు చేసే శక్తి రేవంత్ కు లేదు: కిషన్‌రెడ్డి

71చూసినవారు
హామీలు అమలు చేసే శక్తి రేవంత్ కు లేదు: కిషన్‌రెడ్డి
తెలంగాణలో బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. 'దేశంలో మేథావులు, విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉంటాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ప్రజల పక్షాన పోరాడుతాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్