గీత దాటేస్తున్న రేవంత్ దూకుడు

546చూసినవారు
గీత దాటేస్తున్న రేవంత్ దూకుడు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చ‌ర్చ‌నీయాంశంగా ఉంది. ప్రధాని మోడీ.. ఆయన నీడలా ఉండే అమిత్ షా జోలికి వెళ్లేందుకు ఎవ‌రూ పెద్దగా ఆసక్తి చూపరు. అయితే.. ఆ గీతను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. తాజాగా హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని మొఘల్ పురా పోలీస్ స్టేషన్ లో అమిత్ షా మీద కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు కేసు నమోదు చేయటమే కాదు.. ఎఫ్ఐఆర్ ను సిద్ధం చేసిన వైనం చూసినప్పుడు.. రేవంత్ సామాన్యుడు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సంబంధిత పోస్ట్