TG: దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటివరకు రూ.1.64 లక్షల కోట్ల పెట్టుబడులను రేవంత్ బృందం సాధించింది. దేశ విదేశాలకు చెందిన పేరొందిన 16 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్లుగా భారీ పెట్టుబడులను సాధించింది.