వారణాసిలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి చెందారు. సంగారెడ్డి జిల్లా వాసులు మృతి పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రుల చికిత్స నిమిత్తం యూపీ ప్రభుత్వం అధికారులతో మాట్లాడాలని సీఎం సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో టిప్పర్‌ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.