భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య రెండో వన్డే సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ ఒకే తప్పును రిపీట్ చేయడంతో సహనం కోల్పోయిన హిట్ మ్యాన్.. ముందుకు పరుగెత్తుకొచ్చి కొడతానని హెచ్చరించాడు. అయితే, రోహిత్ సరదాగానే కోపగించినట్టు వీడియోలో చూడొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.