భారతదేశంలో జపనీస్ పుదీనాకు గిరాకీ ఉంది. పుదీనాను పాన్‌మసాలాల్లో, దగ్గు, జలుబు, నొప్పులను తగ్గించే ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. టూత్‌పేస్టులు, మౌత్‌వాష్‌లు, చూయింగ్‌గమ్ మొదలగు వాటిలో పుదీనాను వాడుతున్నారు. జనవరి-ఫిబ్రవరి 15 వరకు నాటుకోవాలంటే పిలకలను పొలంలో నాటుకోవచ్చు. వరుసల మధ్య 60 సెం.మీ, మొక్కల మధ్య 10 సెం.మీ. ఉండేలా నాటుకోవాలి. జనవరి, మార్చి నెలల మధ్య రెండు వారాలకోసారి తడి ఇవ్వాలి.