అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఢిల్లీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఢిల్లీలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన మహిళలకు ఉచితంగా ప్రతి నెలా రూ. 2,500 సాయం చేసే"మహిళా సమృద్ధి యోజన"ను ప్రారంభించింది. దీనికి బీపీఎల్ కార్డులున్న మహిళలు మాత్రమే అర్హులు. ఈ పథకం 21-60 ఏళ్ల వయస్సు గల, వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షలకు మించని మహిళలకు వర్తిస్తుంది. ఈ పథకానికి ఢిల్లీ ప్రభుత్వం రూ. 5100 కోట్ల బడ్జెట్ కేటాయించింది.