రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఓ పాఠమని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే త్రిపాఠి తెలిపారు. ఓ షోలో పాల్గొన్న త్రిపాఠి మాట్లాడుతూ.. ప్రత్యర్థులను తక్కువ అంచనా వేస్తే.. వారు సాంకేతికతను వినియోగించుకొని శక్తివంతమైన విరోధులకు సవాల్ విసిరే అవకాశం ఉందన్నారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో ఘర్షణలు మొదటిలోనే ముగుస్తాయని అనుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు.