AP: కూటమి ప్రభుత్వం విశాఖను అభివృద్ధి చేసేందుకు కూటమి అడుగులు వేస్తోంది. త్వరలో మెట్రో నిర్మాణ పనులు మొదలు పెట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో 35కు పైగా రోడ్ల నిర్మాణాలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. బోగాపురం ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు కేంద్రంగా విశాఖ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందిస్తోంది.