రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని.. అతడే తమకు మ్యాచ్‌ను దూరం చేశాడని ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రుతురాజ్ గైక్వాడ్ వల్లే తాము ఓడిపోయామని సూర్య వెల్లడించారు. తాము 15-20 పరుగులు తక్కువగా చేశామని ఆయన తెలిపారు. అయినా, తమ కుర్రాళ్లు అద్భుతంగా పోరాడారని అన్నారు. కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వడంలో ముంబై ఎప్పుడూ ముందుంటుందని తమ యువ క్రికెటర్ విఘ్నేశ్‌ను ఉద్దేశించి సూర్య అన్నారు.