AP: నంద్యాల విజయ డెయిరీలో ఖాళీగా ఉన్న ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు భారీ సంఖ్యలో వచ్చి అడ్డుకోవడానికి యత్నించారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. దాంతో నంద్యాల విజయ డైయిరీ ఎండీ ప్రదీప్ పోలీసుల సలహా మేరకు నామినేషన్ ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.