శభాష్.. చేతులు లేకున్నా కాలితో ఓటేశాడు(వీడియో)

81చూసినవారు
రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కును వినియోగించుకొని ప్రతి ఒక్కరూ ఓటువేయాలి. ఓటు వేయని వారికి ఓటు విలువ తెలిసేలా రెండు చేతులు లేకున్నా ఓ వ్యక్తి కాలితో ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు. గుజరాత్ రాష్ట్రం నడియాడ్ లోని పోలింగ్ బూత్ లో అంకిత్ సోని అనే యువకుడు కాలితో ఓటు వేసి తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. 'ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయండి' అంటూ ఆయన పిలుపునిచ్చారు. కాగా 20 ఏళ్ల క్రితం ఓ ప్రమాదంలో అంకిత్ రెండు చేతులూ కోల్పోయాడు.

సంబంధిత పోస్ట్