సచిన్‌ ఆట మొదలైంది ఈ రోజే.!

52చూసినవారు
సచిన్‌ ఆట మొదలైంది ఈ రోజే.!
సరిగ్గా ఇదే రోజు 30 ఏళ్ల క్రితం (మార్చి 27, 1994) మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్ కెరీర్‌ మలుపు తిరిగింది. ఓపెనర్‌గా ఆడిన ఆ తొలి మ్యాచ్‌లో 49 బంతుల్లో 82 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఆ తర్వాత సచిన్‌ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొత్తంగా 344 వన్డేలు ఆడి 48.29 సగటుతో 15,310 పరుగులు చేశాడు. ఇందులో 49 వన్డే సెంచరీలు ఉండటం విశేషం. 1996-2007 మధ్య సచిన్‌- గంగూలీ 136 ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు నాటౌట్‌గా నిలిచారు. వీరి అత్యధిక భాగస్వామ్యం 258.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్