ఆర్థికాభివృద్ధిని దాయడం సరికాదని మాజీ మంత్రి హరీష్‌రావు అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని ఆర్థికంగా దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దామని, అయితే ఆ పరిస్థితిని కాంగ్రెస్ మసిపూసి మారేడుకాయ చేస్తూ దృష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందిందని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పాలనపై అబద్ధపు ప్రచారం మానలేదని అన్నారు.