బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నేడు డిశ్ఛార్జి కానున్నారు. జనవరి 16న ఓ దుండగుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి కత్తితో గాయపరచగా ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే సైఫ్ కోలుకోవడంతో వైద్యులు నేడు డిశ్ఛార్జి చేయనున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే నిందితుడిని పట్టుకున్న పోలీసులు నేడు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది.