ప్రముఖ హీరోయిన్ సమంత మరోసారి ప్రేమలో పడిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. జీవితంలో మళ్లీ ప్రేమలో పడాలని ఎప్పుడూ ఆలోచించలేదని సామ్ చెప్పింది. ప్రేమ గురించి చర్చించాలని కూడా తనకు లేదని తెలిపింది. సమంత మాటలను బట్టి చూస్తే.. మరోసారి ప్రేమలో పడాలనే ఉద్దేశం ఆమెకు లేదనే విషయం స్పష్టమవుతోందని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.