అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

163చూసినవారు
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
సంగారెడ్డి పట్టణంలో తారా ప్రభుత్వ కళాశాలలో బుధవారం యూనిట్స్ 1, 2, 3, 4 ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, పోషన్ మహా 2021లో భాగంగా అక్షరాస్యత, పౌష్టిక ఆహారం అనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ తెలిపారు. ఆరోగ్యకరమైన జీవితానికి పౌష్టిక ఆహారం ఎంతో అవసరమని, వ్యక్తికి మానసిక, శారీరక ఆరోగ్యాలు రెండూ అవసరమే అని తెలిపారు. భారతదేశంలో సుమారు 80 శాతం నుండి పిల్లలు పోషకాహారలోపంతో బాధపడడం ఆందోళనకరమైన విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్, డాక్టర్ పద్మజా, డాక్టర్ జగదీశ్వర్, సిద్ధూలు, కళాశాల అధ్యాపకుడు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్