సంగారెడ్డిలో గల తారా ప్రభుత్వ కళాశాలలో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు సంబంధించి ఖాళీగా ఉన్న వివిధ విభాగాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించటం జరుగుతుందని
అర్హత కల్గిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ తెలిపారు. తారా కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీ.జి,ఎం ఏ తెలుగు, ఇంగ్లీష్, అర్థశాస్త్రము, రాజనీతి శాస్త్రము,ఎం.కాం,ఎం. ఎస్. సి: బాటనీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమేటర్స్ , ఫిజిక్, జూవాలజి సబ్జెక్టులు ఖాళీలు ఉన్నాయని, వీటిలో చేరుటకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరటం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు పీ.జి ఎంట్రన్స్ రాసినా, వ్రాయకపోయినా సంబంధిత సబ్జెక్టులు లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉందని తెలిపినారు. అభ్యర్థులు 23/12/2022 వ ఉదయం 10:00 లకు అన్నీ ఓరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, 1 జీరాక్స్ సెట్ తో ఇంటర్వుకు హాజరు కావాలని, ఆసక్తి కల్గి డిగ్రీ పూర్తయిన విద్యార్ధులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అదే రోజు ఫీజ్ చెల్లించాలి అని తెలిపారు.