అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ నాయకత్వంలో జీహెచ్ఎంసి భారతినగర్ 111వ డివిజన్ లో బుధవారం టీఆర్ఎస్ అభ్యర్థి సింధూ ఆధర్శ్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్, జోగిపేట మున్సిపల్ ఛైర్మన్ గూడెం మల్లయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో అభివృద్ధికి నోచుకోని జీహెచ్ఎంసి నేడు తెరాస ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వమేనని వారన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస స్థానిక నాయకులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.