జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నోటీసు బోర్డుపై ఉపాధ్యాయుల ఫోటోలు ఉంచాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ, కస్తూర్బా, గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల ఫోటోలను డిస్ప్లే చేయాలని సూచించారు