కంగ్టి: టెంట్ హౌస్ దగ్ధం.. రూ.30 లక్షల నష్టం
కంగ్టి మండలం నాగంపల్లిలో బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో టెంట్ హౌస్ కాలిపోయింది. వాగంపల్లికి చెందిన శివాజీ పాటిల్ 5 సంవత్సరాలుగా టెంట్ హౌజ్ నడిపిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు రావడంతో షాపు దగ్ధమైంది. దీంతో దాదాపుగా రూ. 30 లక్షల సామాగ్రి కాలిపోయిందని బాధితుడు ఆవేదన వ్యక్యం చేశాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నాడు.