స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గం మున్సిపాలిటీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం విద్యార్థిని విద్యార్థులకు డోర్ టు డోర్ చెత్త సేకరణపై అవగాహన కల్పించినారు. ప్రతి ఇంటిలో నుండి వచ్చే చెత్తను తడి చెత్తగా, పొడి చెత్తగా, హానీకరణ చెత్తగా విడదీసి మీ ఇంటి దగ్గరకు వచ్చే మున్సిపల్ వాహనాలకు అందించాలని అవగాహన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ జే జేగ్ జీవన్, తదితరులు పాల్గొన్నారు.